''అందరూ అలవరచుకోవలసిన విశిష్ట గుణాలలో కృతజ్ఞత ఒకటి. మనకు అనుక్షణం సహకరిస్తున్న అమానుష సంస్థలున్నవి. అట్టి అధికారస్థానాలే ఆలయాలు. వానికి చెల్లించే పన్ను లేదా మనం చూపే కృతజ్ఞత- యజ్ఞం. ఈశ్వరానుగ్రహంలో అచంచలమైన విశ్వాసం అలవర్చుకొని ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికి ఓర్చుకోగల సహనశక్తి పెంపొందించు కోవడమే ప్రస్తుతం మనకున్న వ్యాధిని కుదర్చగల పరమౌషధం. ఆ సహనశక్తి మనకు ఒక్క భక్తివల్ల కాని లభించదు. భక్తిని పెంపొందించడానికి ఏర్పడిన సంస్థలే ఆలయములు.''
|